ముస్లిం పేద మహిళ పుత్రిక వివాహానికి బీరువా అందజేత
నంద్యాల జిల్లా/ ఆళ్లగడ్డ (AIMA MEDIA):
ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ఒక ముస్లిం పేద మహిళ తమ పుత్రిక వివాహం కొరకు బీరువాల భాషను సహాయం కోరారు. బీరువాలు భాష తక్షణమే స్పందించి ఆళ్లగడ్డకు పట్టణం లోని పుల్లారెడ్డి వీధికి చెందిన మహమ్మద్ రఫీ కి విషయం వివరించడంతో ఆయన వెంటనే స్పందించి ఆ మహిళ పుత్రిక వివాహం కు తన వంతు సహాయంగా రూ.12000 విలువ గల బీరువా నూ తక్షణమే అందించారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న లేక నిర్మించి ఉన్న మసీదులకు మదారాసాలకు ఏవైనా అవసరం ఉంటే తన వంతు సహాయంగా ఎంతోకొంత అందించడం జరుగుతోందని తెలియజేశారు.మనకు ఉన్నదాంట్లోనే లేని వారికి ఇవ్వడం వల్ల ఆ అల్లా కృప లభిస్తుందని కావున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి పేద నిరుపేదలకు తమ వంతు చేయూతను అందించాలని ఆయన మీడియా ముఖంగా కోరారు. ఎంతోమంది పేద నిరుపేదలకు సహాయ సహకారాలు ఇస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త బీరువాళ్ళ భాషా కు బీరువా దాత రఫీకి ఆ పేద మహిళ తమ ధన్యవాదాలు తెలియజేశారు.