విజయనగరంలో నేడు పలు ప్రాంతాలకు వాటర్ కట్
విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలోని శుక్రవారం పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ నల్లనయ్య చెప్పారు. కొ త్తపేట వాటర్ ట్యాంక్ నుంచి వస్తున్న పైపులైన్ రాజారావు మేడ సమీపంలో లీకవ్వడంతో పల్లివీధి, కోలగట్లవారివీధి, కమ్మవీధి, చిక్కాలవీధి, తెలకలవీధి రామమందిరం, కొనిశవీధి ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. యుద్ధప్రాతిపదికన పనులు చేస్తామన్నారు.