logo

ఆక్రమణలు తొలగింపు* *పాదచారులకు, వాహన చోదకులకు ఇక్కట్ల*. *దృష్టి సారించిన వన్ టౌన్ పోలీసులు

*ఆక్రమణలు తొలగింపు*

*పాదచారులకు, వాహన చోదకులకు ఇక్కట్ల*.

*దృష్టి సారించిన వన్ టౌన్ పోలీసులు*

విజయవాడ వన్ టౌన్, జూన్ 21
30 అడుగుల రోడ్డు... 20 అడుగులు ఆక్రమణలే... ఇక ఆపై మిగిలింది 10 అడుగులే...
వాహనాలు ఏ విధంగా ప్రయాణిస్తాయి... ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరు...
విచ్చలవిడిగా ఆక్రమణలు ప్రోత్సహిస్తున్నది ఎవరు.... పాద చారులు, వాహన చోదకుల నుంచి విన్నపాల నేపథ్యంలో ఆక్రమణలు తొలగించే కార్యక్రమానికి వన్ టౌన్ పోలీసులు శ్రీకారం చుట్టారు.
వన్ టౌన్ ప్రాంతం అనగానే చిన్న రోడ్లు అనే భావనలోనే ఉన్నారు తప్ప నిజానికి ఆ రోడ్డు సైతం పెద్ద రహదారులే.. 30 అడుగుల నుంచి 40 అడుగుల వరకు పలుచోట్ల రోడ్లు వెడల్పు ఉన్నప్పటికీ రోడ్డుకి ఇరువైపులా
ఆక్రమణులు జరగడంతో ఆ రోడ్లన్నీ 10 అడుగుల రోడ్డుగా మారిపోయాయి.

*పశ్చిమ ఏసీపి దుర్గారావు*,
*వన్ టౌన్ సిఐ గురు ప్రకాష్* *ప్రత్యేక చొరవ*

వన్ టౌన్ ప్రాంతంలోని ట్రాఫిక్ సమస్యపై ఆక్రమణల పరంపరపై విజయవాడ పశ్చిమ ఏసిపి దుర్గారావు ప్రత్యేక దృష్టి సారించారు. ఏసీపీ దుర్గారావు,
వన్ టౌన్ సిఐ గురు ప్రకాష్ ఆదేశాల మేరకు వన్ టౌన్ లోని వివిధ రహదారులు ఆక్రమణలు తొలగించే కార్యక్రమానికి వన్ టౌన్ పోలీసులు శ్రీకారం చుట్టి ఆక్రమణలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.
వన్ టౌన్ ఏఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాత శివాలయం వీధి, ఐరన్ సెంటర్, మెయిన్ బజార్ లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు.

*ఆక్రమణ చేపడితే కఠిన చర్యలు*

ప్రయాణికులకు పాద చారులకు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్డుకు అడ్డంగా ఆక్రమణలు చేపడితే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు వారు హెచ్చరించారు. ఆక్రమణలు తొలగించిన పోలీసువారికి ఏసీపి, దుర్గారావు, సి ఐ గురు ప్రకాష్,
వన్ టౌన్ పోలీస్, ట్రాఫిక్ అధికారులకు, సిబ్బందికి ప్రయాణికులు స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

7
277 views