
పిల్లల జీవితాలు డ్రైవర్లు చేతుల్లోనే ఉంటాయ్: జిల్లా రవాణా శాఖ అధికారి.
నంద్యాల జిల్లా/పాణ్యం (AIMA MEDIA):
భద్రత అవగాహన సదస్సులో భాగంగా శుక్రవారం ఆర్ జి ఎం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును నిర్వహించిన జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్య రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ సమర్థవంతంగా వాహనాలు నడపాలన్నారు. సురక్షితంగా పిల్లలను తమ గమ్యానికి చేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. బస్సు సక్రమంగా పనిచేస్తుందో లేదో బయలుదేరే ముందు తప్పనిసరిగా పరీక్షించుకోవాలన్నారు. బ్రేకులు, హారాన్, లైట్లు టైర్లు సక్రమంగా పనిచేసేలా గమనించుకోవాలన్నారు. పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్లి ఇంటికి చేర్చే వరకు వారి తల్లిదండ్రులు డ్రైవర్ల పైనే భారం వేసి ఉంటారన్నారు. డ్రైవర్లు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అన్నారు. గుట్కా, మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు. పాఠశాలలు తెరిచే సమయానికి డ్రైవర్లకు రహదారి నియమాలపై అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్త మాట్లాడుతూ బస్సుల్లో సీసీ కెమెరాలు, మిర్రర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి వాహనానికి ఒక అటెండర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. పిల్లలను రోడ్డు దాటించి తమ తల్లిదండ్రులకు అప్పగించిన బాధ్యత ఉందన్నారు. బస్సులు కండిషన్లో ఉండేలా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బస్సుల డ్రైవర్ల పనితీరును పరీక్షించుకోవాలన్నారు. వాహనం నడిపే సమయంలో సెల్ఫోన్ ఉపయోగించరాదన్నారు. ఈ ఏడాది దేశంలో 13452 బస్సు ప్రమాదాలు జరిగాయని ఇందులో 203 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రెండింతలు ప్రమాదాలు పెరిగాయి అన్నారు. డ్రైవర్ల జాగ్రత్త పిల్లలకు రక్షణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం వి ఐ శ్రీకాంత్, కళాశాల డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, విద్యాసంస్థల డ్రైవర్లు పాల్గొన్నారు.