logo

బుగ్గారంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బుగ్గారంలో ఘనంగా తెలంగాణ
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
మండల తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తహసీల్దార్ అబ్దుల్ మాజిద్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్రీధర్ రెడ్డి, ఎంపిపి, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో మండల, గ్రామ ప్రత్యేక అధికారిని అయిన జిల్లా బిసి వెల్ఫేర్ అధికారిని జి. సునిత జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, బిఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ ల వారు కూడా జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ పోరాటాలను, అమరుల త్యాగాలను గుర్తు చేశారు. ప్రత్యేక అధికారిణి సునీత చేతుల మీదుగా
గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేశారు.
వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, గిర్ధావర్ బాపురెడ్డి, పూర్తి అదనపు బాధ్యతల ఎంపీడీవో, ఎంపీవో అఫ్టల్ మియా, ఆయా కార్యాలయాల సిబ్బంది, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి నాయకులు, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు పెద్దనవేని రాగన్న, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పెద్దనవేణి శంకర్, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సిగిరి అంజిత్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు తాడేపు లింగన్న, జంగ శ్రీనివాస్, కాంగ్రెస్, బిఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోడిమ్యాల రాజన్న, పొన్నం సత్తన్న, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు సుంకం ప్రశాంత్, సుంకం గంగాధర్, వివిధ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.

4
231 views