logo

ప్రియమైన మామయ్య ఫోన్ కు దూరంగా ఉంటా... చదువుకు అనుమతి ఇవ్వండి... అంటూ ఓ కుర్రాడు తన మేనమామకి లేఖ రాశాడు.......

ప్రియమైన మామయ్య ఫోన్ కు దూరంగా ఉంటా... చదువుకు అనుమతి ఇవ్వండి... అంటూ ఓ కుర్రాడు తన మేనమామకి లేఖ రాశాడు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. తన మేనల్లుడు సెల్ ఫోన్ కి బానిస అయ్యాడని గ్రహించిన ఓ డిపార్టుమెంటులో విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి ఇకపై నువ్వు చదువు మానేసి సెల్ ఫోన్ తోనే ఆడుకోవాలని ముద్దుగా హెచ్చరించాడు. దాంతో కంగుతిన్న ఆ బాలుడు తన మేనమామను నేరుగా ఎదుర్కోలేక తన అలవాట్లను మార్చుకుంటానని ప్రమాణం చేస్తూ.. పై చదువులకు అనుమతి ఇవ్వండి అంటూ లేఖ రాశాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలోని స్నాప్ చార్ట్స్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లకు దూరంగా ఉంటానని, ఎలాంటి చెడు అలవాట్లకు లోనవ్వకుండా బుద్ధిగా చదువుకుంటానని ఆ బాలుడు లేఖలో తన మేనమామకు మాట ఇచ్చాడు. ఇలా ప్రమాణం చేస్తూ తన మేనమామకు రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను ఆలోచింపజేస్తుంది. పిల్లలను దారికి తెచ్చుకునే ఏ ప్రయత్నం అయినా మంచిదే అంటూ, ఇలా మామయ్య చేసిన హెచ్చరిక అల్లుడిలో మార్పు తెచ్చిందని నేటిజన్లు మెచ్చుకుంటున్నారు....

https://www.dishadaily.com/telangana/karimnagar/to-my-dear-uncle-a-thought-provoking-letter-from-my-son-in-law-443999

1
508 views