logo

అంతపూర్ గ్రామంలో ఉచిత కంటి వైద్య పరీక్ష..

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి నాగభూషణం, కామారెడ్డి జిల్లా : మద్నూర్ మండలంలోని అంతపూర్ గ్రామం లో బోధన్ లయాన్స్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్ష నిర్వహించిన వైద్య సహాయకులు ఓం ప్రకాష్ మరియు వైద్య సిబ్బంది. హన్మంతు రావు పాల్గొని కంటి పరీక్షలు చేయడం జరిగింది. తదనంతరం ఏవైనా సర్జరి సమస్యలు ఉంటే బోధన్ లయన్స్ ఐ హాస్పిటల్ లో ఉచిత సేవలను వినియోగించుకోవాలని వైద్య సహాయకులు గ్రామస్తులకు సూచనలు ఇవ్వడం జరగింది. ఈ కార్యక్రమం లో వారితో పాటు పాల్గొన్న గ్రామస్తులు బతుల్వర్ సాయిలు, గైచోడ్ రాజు, వాగ్మారే మరోతి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

4
37 views