logo

పోలీస్ శాఖకే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి ఉదయ్ కుమార్ రెడ్డి. ఐ.పీ.ఎస్. మీడియా టుడే -మెదక్ --- ఐ జి. చంద్రశేఖర్ రెడ్డి

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సేవలు అమోఘం
--- ఎంపీ రఘు నందన్ రావు.

మెదక్ జిల్లా కు ఎస్పీ సేవలు మరువలేనివి
-- శాసన సభ్యులు రోహిత్ రావు.

ఉత్తమ సేవలు అందించారు
-- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా ఎస్పీ సేవలు అమోఘమని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
జిల్లా ఎస్పీ పదవీ విరమణ సమావేశం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐ జి చంద్రశేఖర్ రెడ్డి
జిల్లా న్యాయమూర్తి నీలిమ,ఎంపీ రఘు నందన్ రావు,స్థానిక శాసనసభ్యులు రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఐ జి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థకు వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి అని అన్నారు.
ఎంతో అంకిత భావంతో,క్రమ శిక్షణ తో ఉద్యోగాన్ని నిర్వహించాడన్నారు.
ఎంపీ రఘు నందన్ రావు మాట్లాడుతూ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అమోఘమైన సేవలు అందించాలని గుర్తు చేశారు.
బాధ్యత తో పోలీస్ ఉంద్యోగాన్ని నిర్వర్తించారని తెలిపారు.
స్థానిక శాసన సభ్యులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ గా సేవలు మరువలేనివి అన్నారు.
జిల్లా ప్రజలు ఎప్పటికీ సేవలు మర్చిపోరని గుర్తు చేశారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఉత్తమ సేవలందించారని, చాలా కార్యక్రమాల్లో, కలెక్టర్ ,ఎస్పీ కలసి పనిచేసినట్టు తెలిపారు.
జిల్లా జడ్జి నీలిమ మాట్లాడుతూ రిటైర్మెంట్ అనేది సర్వసాధారణమని, రిటర్మెంట్ తర్వాత ఉత్తమ ఆరోగ్యకరమైన జీవితం కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

24
117 views