logo

రాజీవ్ యువ వికాసం ఇంటర్వ్యూలు - హాజరైన దరఖాస్తు దారులు

రాజీవ్ యువ వికాసం ఇంటర్వ్యూ లు - హాజరైన దరఖాస్తు దారులు


జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపిపి కార్యాలయంలో శుక్రవారం రాజీవ్ యువ వికాసం ఇంటర్వూలు జరిగాయి. హాజరైన దరఖాస్తు దారులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ ఖాతా పుస్తకం, విద్యార్హత సర్టిఫికెట్ లు అందజేశారు. ఎంచుకున్న వ్యాపార వివరాలు తెలియజేసి సంబంధిత పత్రాలపై సంతకం చేశారు. ఒక సెట్ జిరాక్స్ పత్రాలు అందజేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సతీష్, ఎంపీవో / ఇంచార్జ్ ఎంపిడివో అఫ్జల్ మియా, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

142
8612 views