logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అకాల వర్షం వలన నష్టపోయిన రైతులని ఆదుకోవాలి......తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు బంటు వెంకటేశ్వర్లు

VBSTV NEWS Nalgonda అకాల వర్షం వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలి రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సమితి సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణలో అనేక చోట్ల ఉరుముల మెరుపులతో ఈదురుగాలులతో అకాల వర్షం రావడం . ఈ వర్షం వలన ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు ఐకెపి కేంద్రాలలో పోసినారు ఇప్పటికీ నెలరోజులు కావస్తున్నా ఐకెపి సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు విషయంలో హమాలీలు లేరని భువన సంచులు దొరక లేదని లారీలు లేవని కుంటి సాకుతో అధికారులు నిర్లక్ష్యం చేయటం, వర్షాల వలన రైతులు పూర్తిస్థాయిలో నష్టపోతున్నారని అన్నారు. భారీగా వచ్చిన వర్షం వలన రైతులు ధాన్యం వర్షపు నీటితో కొట్టుక పోతున్నాయని
వారన్నారు. ఐకెపి కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం వలన ఐకెపి కేంద్రాల్లో ఉన్న రైతులు పూర్తిగా నష్టపోతున్నారని మరోవైపు ఒకవైపు రైతులు వర్షం వలన నష్టపోతే మరొకవైపు తడిసిన ధాన్యమని క్వింటాల్కు 5 నుంచి 10 కేజీల
వరకు తరుగు తీసే ఆలోచన చేస్తున్నారని అన్నారు.అధికారుల నిర్లక్ష్యం వలన రైతుల నష్టపోవాల్సి నా అవసరంలేదని తడిచిన ధాన్యానికి ఎలాంటి తరుగు తీయకుండా బేషరతుగ కొనుగోలు చేయాలని అన్నారు. నష్టపోయిన రైతులకు అంచనా వేసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేశారు.

135
3851 views

Comment