logo

*పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, మే 17 :- *ఇకనుండి పోలీసులకు నక్షత్ర హాస్పిటల్ లో ఆరోగ్య భద్రత సేవలు - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్



*ధ్రువీకరణ పత్రాన్ని నక్షత్ర హాస్పిటల్ యజమాని డాక్టర్ సందీప్ ఐత్వార్ కు అందజేసి సేవల ప్రారంభం.*

*జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో జిల్లాలో మొట్టమొదటి నక్షత్ర హాస్పిటల్ ఆరోగ్య భద్రత కింద పోలీసులకు సేవలందించనుంది.*

*ఇన్ పేషంట్ విభాగం నందు ఉచిత వైద్య సేవలను పోలీసులు వారి కుటుంబ సభ్యులు పొందవచ్చును.*

*న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిషన్, ఆర్థోపెడిక్, కిడ్నీ సమస్యలకు, ఇఎన్ టి విభాగాలలో వైద్య సేవలు*

*హాస్పిటల్ ను పరిశీలించి వైద్య సేవలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ.*

పోలీసు సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత కింద వైద్య సేవలకు సుదూర ప్రాంతాలకు వెళ్లవలసిన సందర్భంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేక చొరవతో ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నక్షత్ర హాస్పిటల్ నందు పలు విభాగాలలో ఇన్ పేషెంట్ అయిన వారికి ఉచిత వైద్య సేవలను ఈరోజు నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం స్థానిక నక్షత్ర హాస్పిటల్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ హాస్పిటల్ పరిసరాలను మరియు అందించే సేవలు హాస్పిటల్ నందు అందించబడే వైద్య సేవల పద్ధతిని పరిశీలించారు. ఐ సి యు, ఎన్ ఐ సి యు, జనరల్ విభాగం, ల్యాబ్, ఓపి, ఆపరేషన్ థియేటర్ లాంటివి పరిశీలించి సిబ్బందికి నాణ్యమైన సేవలు సకాలం లో అందించాలని సూచించారు. ఆరోగ్య భద్రత కింద పోలీసు సిబ్బందికి న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిషన్, ఆర్థోపెడిక్, కిడ్నీ సమస్యలకు, ఇఎన్ టి విభాగాలలో వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఆస్పత్రి డాక్టర్లు సందీప్ ఐత్వర్ మరియు శిల్ప అకిరా జిల్లా ఎస్పీకి పుష్పగుచ్చం, శాలువా తో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బంది ఈ అవకాశాన్ని ఆపత్కాల సమయంలో వినియోగించుకోవాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసు సిబ్బందికి సదూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆరోగ్య భద్రత కింద నక్షత్ర హాస్పటల్ లో తెలుపబడిన సేవలను ఇన్ పేషెంట్ విభాగం నందు పొందవచ్చునని సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సందీప్ ఐత్వర్, శిల్ప ఆకేరా, ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

11
791 views
  
1 shares