logo

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తన 71వ పుట్టినరోజు ....

అన్నాడీయంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తన 71వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్లారు. రోడ్డు మార్గంలో ప్రయాణించిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వి. అంబ్రోస్ విల్సన్ నగరిలో స్వాగతం పలికారు. అలాగే రాబోయే ఎన్నికలలో మెజారిటీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా రామాపురం, పుత్తూరు, రేణిగుంట ప్రాంతాలలో అన్నాడియంకే కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంలో పార్టీ నాయకులు బాబు నాయుడు, గోవిందస్వామి, పండు, ముత్తువేల్ తదితరులు పాల్గొన్నారు.

33
3155 views