logo

గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టాలి - విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్



వంగర మండలంలో లక్ష్మీదేవిపేట, వంగర పోలీసు స్టేషన్ను మే 13న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సందర్శించి, గ్రామంలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వంగర మండలం లక్ష్మీదేవిపేట గ్రామాన్ని సందర్శించి, ప్రస్తుతం గ్రామంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. గ్రామంలోని ప్రధాన వీధులను సందర్శించారు. 2012 సం.లో గ్రామంలో బీసీలు, ఎస్సీల మధ్య గొడవలకు గల ప్రధాన కారణాలను, గ్రామంలో ప్రస్తుత పరిస్థితి, న్యాయస్థానంలో కేసుల విచారణకు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రజలందరూ శాంతియుతంగా మెలిగే విధంగా చూడాలన్నారు. తరచూ గ్రామంలో గ్రామసభలు నిర్వహించి, శాంతి నెలకొనే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గ్రామంలో పోలీసు పికెట్ ను కొనసాగించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అంశాలు ఏమైనా ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని రావాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో ఎటువంటి అలసత్వం వద్దని, గ్రామంలో బీసీలు, ఎస్సీలు మధ్య గొడవలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
అనంతరం, వంగర పోలీసు స్టేషన్ను సందర్శించి, అధికారులతో సమావేశమై, శాంతిభద్రతల పరిరక్షణకు దిశా నిర్దేశం చేశారు.
జిల్లా ఎస్పీ గారి వెంట చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, రాజాంఈ రూరల్ సిఐ హెచ్.ఉపేంద్రరావు, ఎస్బి సిఐ ఎ.వి.లీలారావు, వంగ ఎస్సై షేక్ శంకర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

12
546 views