ఇలా ఉంటే కరెంట్ బిల్లు కట్టేదెలా ?
ఇది ఆర్ & బి గెస్ట్ హౌస్ వద్ద గల కరెంట్ బిల్లులు కట్టించుకునే కేంద్రం.. చుట్టుపక్కల ప్రాంతాలందరికి అందుబాటులో వుండే కేంద్రం.. ఇక్కడ నుండే విద్యుత్ సిబ్బంది కూడా విధులు నిర్వర్తిస్తుంటారు.
అయితే ప్రస్తుతం చిరు వ్యాపారం చేసుకునే వారు ఈ కేంద్రం ముందున్న వరండా ఆక్రమించడంతో కరెంట్ బిల్లులు కట్టేందుకు వచ్చే వినియోగదారులంతా మార్గం లేక ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ సిబ్బంది కూడా చూసి చూడనట్టు వ్యవహరించడంతో చేసేదేమి లేక వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు కేంద్రం ముందు ఖాళీ చేయించి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.