logo

ఆ ఆయుధాలను పాక్ అక్కడే దాచిందా

Kirana Hills: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తే.. ప్రతిగా పాకిస్థాన్ క్షిపణులు, డ్రోనులతో దాడి చేసింది. వాటిని భారత్ తిప్పికొట్టింది. అనంతరం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అలాంటివేళ కిరానా హిల్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్దాన్ని ఆపామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే.. అణ్వాయుధాలను ప్రయోగిస్తే మాత్రం వినాశం జరిగి ఉండేదంటూ ఆయన తెలిపారు. అయితే పాకిస్థాన్‌.. తన అణ్వాయుధాలను కిరానా హిల్స్‌ ప్రాంతంలో భద్రపరిచిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. అలాంటి వేళ.. కిరానా హిల్స్‌పై భారత్ దాడి చేసిందంటూ వార్తలు వైరల్ అయినాయి. కానీ ఈ వార్తలను సైన్యం కోట్టేసింది. మరి కిరానా హిల్స్ ఎక్కడ ఉన్నాయి.. పాక్ .. తన అణ్వాయుధాలను అక్కడే భద్ర పరిచిందా అంటే
కిరానా హిల్స్ ఎక్కడున్నాయి..

పాకిస్తాన్ అణు స్థావరం సర్గోధలోని కిరానా కొండలలో ఉందని చెబుతారు. నిజానికి, కిరాణా హిల్స్‌లోని భూగర్భ సౌకర్యం సర్గోధ ఎయిర్‌బేస్ నుండి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దాదాపు 70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ మొత్తం ప్రాంతమంతా పాకిస్తాన్ ప్రభుత్వం ఆక్రమించుకుంది. ఈ ప్రాంతం ప్రమాదం నుండి పూర్తిగా సురక్షితమని చెబుతారు. దీని ద్వారా, రోడ్డు, రైలుతోపాటు వాయు రవాణా నేరుగా అనుసంధానించి ఉంది. స్థానిక భాషలో దీనిని బ్లాక్ మౌంటైన్స్ అని పిలుస్తారు. ఎందుకంటే దాని భూమి రాతితో, గోధుమ రంగులో ఉంటుంది. ఈ ప్రాంతం రబ్వా పట్టణానికి సర్గోధ నగరానికి మధ్య ఉంటుంది.కిరాణా కొండలు ఎందుకు ముఖ్యమైనవి?

సర్గోధ ఎయిర్‌బేస్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిరానా హిల్స్‌లో ఒక భూగర్భ సౌకర్యం ఉంది. 1990 ప్రాంతంలో పాకిస్తాన్ అణ్వాయుధ పరీక్షలకు సన్నాహాలు చేస్తోందంటూ అమెరికా ఉపగ్రహం గుర్తించింది. తద్వారా ఈ ప్రదేశం గురించి ప్రపంచానికి తెలిసింది. అయితే అమెరికా అభ్యంతరం చెప్పడంతో.. ఈ పరీక్షలను పాకిస్థాన్ రద్దు చేసింది. కానీ పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఇక్కడ దాచి పెట్టిందనే భయం నేటికి ఉంది. కిరానా కొండల పటాన్ని ఆన్‌లైన్‌లో పరిశీలిస్తే.. ఆకుపచ్చ, గోధుమ పర్వతాల మధ్య కొంత నిర్మాణం కనిపిస్తుంది.


పాకిస్తాన్ రహస్య సొరంగాలను నిర్మించింది..

1983 - 1990 మధ్య, పాకిస్తాన్ కిరానా I అనే సంకేతనామం కింద ఇక్కడ 24 ఉప- తీవ్రమైన అణు పరీక్షలను నిర్వహించింది. కానీ ఇవి నిజమైన అణు పరీక్షలు కావు. కానీ వాటి భాగాలే. ఈ సమయంలో.. ఈ ప్రాంతంలో రహస్య సొరంగాలు నిర్మించారు. పాకిస్తాన్ ఇక్కడ కనీసం 10 సొరంగాలను నిర్మించింది. ఉపగ్రహాలను నివారించడానికి పాకిస్తాన్ ఈ సొరంగాలను నిర్మించిందంటారు.

0
0 views