logo

శ్రీ సత్య సాయి జిల్లాలో అగ్ని వీర్ మురళి నాయక్ అంతక్రియలో వేలాదిగా పాల్గొన్న ప్రజలు

శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం కల్లితండా గ్రామనికి చెందిన అగ్ని వీర్ మురళీ నాయక్ పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందడం జరిగింది. ఆదివారం ఆయన అంత్యక్రియలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్. అనగాని సత్యప్రసాద్. హోమ్ మినిస్టర్ విడతల అనిత. చేనేత జౌళి శాఖ మంత్రి సవిత.హిందూపురం పార్లమెంట్ సభ్యుడు పార్థసారథి వారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆదివారం ఉదయం 10 గంటలకి కల్లి తండాకు చేరుకున్నారు.
తమ ఒక్కగానొక్క కుమారుడు దేశం కోసం పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో అమరుడైనందుకు ఆ తల్లిదండ్రులు గర్వపడాలో లేక బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో గుండెలవిశేలా రోధిస్తున్నారు. తమ బిడ్డను కోల్పోయినందుకు బాధపడుతున్న ఆ తల్లిదండ్రులను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంత్రి నారా లోకేష్ లు ఓదార్చారు ఆ సంఘటన పలువురిని కంటతడి పెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం అగ్ని వీర్ మురళి నాయక్ కుటుంబాన్ని ఆదుకోవడానికి 50 లక్షల రూపాయలు. ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.ఐదు ఎకరాల భూమి ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు నారా లోకేష్ తెలిపారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుండి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందచేయనున్నట్లు తెలుస్తుంది రాప్తాడు శాసనసభ్యులు పరిటాల సునీత ఆమె తనయుడు శ్రీరామ్ ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు సహాయం అందజేసినట్లు తెలిసింది. అగ్ని వీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో వేలాదిమంది ప్రజల సమక్షంలో జరిగాయి. మురళి నాయక్ అమర్ రహే. హిందూస్తాన్ జిందాబాద్. అనే నినాదాలు మిన్ను ముట్టాయి. ప్రజలు అశ్రునయనాలతో అగ్నివీర్ కు నివాళులర్పించారు.

43
4758 views