logo

ప్రజల రక్షణ, భద్రతకే "కార్డన్ అండ్ సెర్చ్" ఆపరేషన్ *- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.*


ప్రజల రక్షణ, భద్రత, నేరాలు, అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషను
పరిధిలోని వై.ఎస్.ఆర్.నగర్ లో “కార్డన్ అండ్ సెర్చ్" ఆపరేషన్ మే 11, వేకువ జామున నిర్వహించి, ఒకేసారి 3070
ఇండ్లల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - విజయనగరం పట్టణం విస్తరించడం, ఇతర ప్రాంతాల నుండి బ్రతకు తెరువుకు కోసం క్రొత్త వ్యక్తులు వచ్చి, పట్టణ శివార్లలో నివాసం ఏర్పాటు చేసుకోవడంతో
అసాంఘిక కార్యకలాపాలు జరిగేందుకు అవకాశం ఉండడం, అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసేందుకు
విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్ చేపట్టామన్నారు. ఈ ఆపరేషన్
నిర్వహించేందుకుగాను 12మంది సీఐలు, 32మంది ఎస్ఐలతోసహా, 400మంది పోలీసు సిబ్బందితో వైఎస్ఆర్ నగర్
లోని 3070 ఇండ్లల్లో సోదాలు నిర్వహించామన్నారు. వైఎస్ఆర్ నగర్లోని 3070 ఇండ్లను 14బ్లాకులుగా విభజించి,
ఒక్కొక్క బ్లాకుకు ఇద్దరు ఎస్ఐ స్థాయి అధికారులు, ఇతర పోలీసు సిబ్బందితో ప్రత్యేకంగా 28 సెర్చ్ బృందాలను
ఏర్పాటు చేసి, వారిని పర్యవేక్షించేందుకు సిఐ స్థాయి అధికారులను నియమించామన్నారు. ప్రతీ బృందంలోను మహిళా
పోలీసులు, మహిళా పోలీసు అధికారులు ఉండే విధంగా చర్యలు చేపట్టామన్నారు. సుమారు 3070 ఇండ్లలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల వివరాలు సేకరించి, వారి వ్రేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరాలతో
తనిఖీలు చేసామన్నారు. అదే విధంగా వారి వద్ద లభించిన వాహనాల రికార్డులను పరిశీలించి, రికార్డులు సక్రమంగాలేని
75 ద్విచక్ర వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం 2వ పట్టణ పోలీసు స్టేషనుకు తరలించామన్నారు. అనుమానిత
వ్యక్తులు పారిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను ముందుగా గుర్తించి, ఆయా మార్గాలను పోలీసు బృందాలతో
ముందుగానే దిగ్భందనం చేసాయన్నారు. ప్రజల రక్షణ, భద్రతకు భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే "కార్టన్ అండ్సెర్చ్" ఆపరేషన్ పట్టణంలోని వైఎస్ఆర్ నగర్లో చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే తరహాలో జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా “కార్డన్ అండ్ సెర్చ్" ఆపరేషన్స్ ఆకస్మికంగా చేపట్టనున్నామన్నారు. ఈ ఆపరేషన్లో
పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లా ఎస్పీ మమేకమై “కార్డన్ అండ్ సెర్చ్" ఉద్ధేశ్యాన్ని, ఆపరేషన్ లో
అధికారులు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను జిల్లా ఎస్పీ వివరించి, ప్రజలెవ్వరితో
దురుసుగా వ్యవహరించ వద్దని దిశా నిర్ధేశం చేసారు. ఈ “కార్డన్ అండ్ సెర్చ్" ఆపరేషన్లో అనుమానస్పదంగా షెల్టరు తీసుకున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుండి 25 మొబైల్ ఫోన్లు, 3 లీటర్ల మద్యం స్వాధీనం
చేసుకున్నామన్నారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషనులో ఎటువంటి నిషేదిత వస్తువులు, గంజాయి, నాటుసారా వంటివి లభ్యం కాలేదని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ “కార్టన్ అండ్ సెర్చ్" ఆపరేషన్లో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, సిఐలు టి.శ్రీనివాసరావు,
ఎస్.శ్రీనివాస్, బి.లక్ష్మణరావు, సిహెచ్.సూరి నాయుడు, కే.దుర్గా ప్రసాద్, జి.రామకృష్ణ, బి.శ్రీనివాసరావు, ఎల్.అప్పల
నాయుడు, సిహెచ్. షణ్ముఖరావు, వి.నారాయణ మూర్తి, బి.లలిత, 32మంది ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, ఎస్టీఎఫ్, బాంబ్, డాగ్ స్వాడ్, డ్రోన్ బృందాలు పాల్గొన్నాయి.

3
75 views