బంధువులకు బంగారం అప్పగించిన పోలీసులు
విశాఖలో అనుమానస్పదంగా తిరిగిన బొబ్బిలి మండలం పక్కకి చెందిన ప్రవీణ్ కుమార్ (రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి)ని పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ACP అప్పలరాజు ఆయన్ను విచారణ చేపట్టగా ఉద్యోగ విరమణ తరువాత అతను వింతగా ప్రవర్తిస్తున్నట్లు నిర్దారణకు వచ్చారు. అయితే విచారణ సమయంలో ఆయన ఒంటిపై 28 తులాల బంగారం, బ్యాంక్ ఖాతాలో రూ.5లక్షల నగదు ఉన్నట్లు గుర్తించి బంధువులకు అప్పగించారు.