కలెక్టరేట్లో రేపు జిల్లా స్థాయి సమీక్ష: ఇన్‌ఛార్జ్ కలెక్టర్
విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్ష సోమవారం జరగనుందని ఇన్ ఛార్జ్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సమీక్ష ప్రారంభమవుతుందని చెప్పారు.
ఈ జిల్లా స్థాయి సమీక్షకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.