logo

రేపే స్వరబృందవనం యొక్క 17వ సినీ సంగీత విభావరి.

సినీ సంగీత మాధుర్యాన్ని అందించడంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన స్వరబృందవనం రేపు అనగా ఆదివారం మే 11న తమ 17వ సినీ సంగీత విభావరితో సినీ సంగీత ప్రియులను అలరించబోతోంది.

హైదరాబాద్ లోని కళాభారతి సిటీ కల్చరల్ హాల్ వేదికగా ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు జరగబోతున్న ఈ కార్యక్రమంలో మొత్తం పద్నాలుగు మంది అద్భుతమైన గాయనీగాయకులు పాల్గొనబోతునట్టు స్వరబృందవనం సంస్థ వ్యవస్థాపకులు శ్రీ బృందావనం రవికాంత్ అలాగే సహ నిర్వాహకులు శ్రీ తూములూరి శ్రీ కుమార్ మీడియాకు తెలియజేశారు.

ఫీమేల్ సింగర్స్ లో శ్రీమతి // సమీరా, శ్రీరాణి, వసుధ యశోద, గాయత్రీ, అభిమైత్రి, నిర్మలా కిషోర్ అలాగే మేల్ సింగర్స్ లో శ్రీ // పసుమర్తి రాంబాబు, చైతన్య, సుబ్బురామన్, వేదవ్యాస్, దీపక్, బృందావనం రవికాంత్ మరియు శ్రీ కుమార్ పాల్గొనబోతున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని కల్చరల్ టీవీ చానెల్ వాళ్ళు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు, ఈ క్రింది లింక్ ద్వారా ప్రసారాన్ని వీక్షించవచ్చు అని నిర్వాహకులు తెలిపారు.

https://youtube.com/live/xDfTa2uLlBY?feature=share

- తూములూరి శ్రీ కుమార్

92
7591 views