logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

 Group 1 Paper Scam: గ్రూప్‌ 1 పేపర్లు గృహిణులు దిద్దారు

ఏపీపీఎస్‌సీ గ్రూప్-1 పరీక్ష పేపర్లను అక్రమంగా మూల్యాంకనం చేయించడం కలకలం రేపింది. గృహిణులు, చంటిపిల్లల తల్లులను డబ్బులు ఇచ్చి ఈ ప్రక్రియలో భాగం చేసినట్లు మధుసూదన్‌ వెల్లడించారు.
ఏపీపీఎస్‌సీ కార్యాలయం బయట పరీక్ష పేపర్ల మూల్యాంకనం చేయడం చట్టరీత్యా నేరం. కానీ మంగళగిరిలోని హాయ్‌ల్యాండ్‌కు గ్రూపు-1 పరీక్ష పేపర్లు తీసుకొచ్చారు. రూ.15,000 ఇస్తామని ఆశపెట్టి గృహిణులు, చంటిపిల్లల తల్లులతో దిద్దించారు. కాబోయే సబ్‌ కలెక్టర్లు, డీఎస్పీల భవిష్యత్‌ను నిర్ణయించే ఈ పరీక్షలో డిగ్రీ కూడా లేని వీరే మార్కులు వేశారు. ఈ విషయం వారికి కూడా పోలీసులు విచారణకు పిలిస్తే కానీ తెలియలేదు. వైసీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణం దర్యాప్తులో విస్తుపోయే విషయాలు ధాత్రి మధుపై పోలీసుల రిమాండ్‌ రిపోర్టులో బయటపడ్డాయి. అప్పట్లో ఏపీపీఎ్‌ససీ కార్యదర్శిగా పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు వ్యవహరించారు. వైసీపీ పెద్దలు సూచించిన వ్యక్తులను ఆర్డీవోలు, డీఎస్పీలుగా చేసేందుకు ‘క్యామ్‌సైన్‌’ అనే మీడియా సంస్థతో కలిసి ఆయన చేసిన బాగోతాన్ని పోలీసులు నిగ్గు తేల్చారు. పమిడికాల్వ మధుసూదన్‌(ధాత్రి మధు)ను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు.. నిందితుడు వెల్లడించిన అంశాలను కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచారు. దాని ప్రకారం.. 2020 డిసెంబరులో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించారు. ఫలితాలను 2021 ఏప్రిల్‌లో డిజిటల్‌ మూల్యాంకనం ద్వారా విడుదల చేశారు.

172
512 views

Comment