కొటియా గ్రామ సమస్యలపై ఎస్టీ ఛైర్మన్‌కి వినతి
ఆంధ్రా - ఒడిశా సరిహద్దు గ్రామమైన కోటియాలో గిరిజనులకు 2 రాష్ట్రాల నుంచి సమస్యలే మిగిలాయని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం జడ్పీ అతిథి గృహంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ శంకరరావును సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. అభివృద్ధి పేరుతో ఒడిశా అధికారులు అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆంధ్రా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.