logo

సులభతరంగా భక్తులకు దాడితల్లి అమ్మవారి దర్శనాలు *- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*



బొబ్బిలి పట్టణంలో ఈ నెల 5, 6 తేదీల్లో జరిగే శ్రీ దాడితల్లి అమ్మవారి పండగ నజావుగా, ఎటువంటి
అవాంఛనీయ జరగకుండాను, భక్తులు సులువుగా అమ్మవారిని దర్శించుకొనే విధంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు
చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మే 5న తెలిపారు. గొల్లపల్లిలోని శ్రీ దాడితల్లి అమ్మవారి వనం గుడి, ప్రధాన
ఆలయాలను, సిరిమాను ఏర్పాట్లును జిల్లా ఎస్పీ స్వయంగా సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - శ్రీ దాడితల్లి అమ్మవారి పండగలో ఎటువంటి అల్లర్లు
జరగకుండా, పండగను శాంతియుతంగా నిర్వహించేందుకు 300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
బందోబస్తును రెండు షిఫ్టుల్లో ఏర్పాటు చేసి, భక్తులు సులువుగా అమ్మవారిని దర్శించుకొనే విధంగా చర్యలు చేపట్టామన్నారు. పండగ రోజుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 90 సీసీ
కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా, వాహనాల రెగ్యులేషను, ట్రాఫిక్, భక్తుల రద్దీని రెండు డ్రోన్స్ తో పర్యవేక్షిస్తామన్నారు. పండగ బందోబస్తును బొబ్బిలి డిఎస్పీ జి.భవ్య పర్యవేక్షిస్తారన్నారు. వాహనదారులకు, ప్రయాణికులకు
ఎటువంటి ఇబ్బంది కలగకుండా బొబ్బిలి AMC జంక్షన్ నుండి కృష్ణాపురం మీదుగా వాహనాలను మళ్లిస్తామని, అదే
విధంగా రాజాం, తెర్లాం నుండి బొబ్బిలి వైపు వచ్చే వాహనాలను పిరిడీ జంక్షన్ నుండి కృష్ణాపురం, AMC జంక్షన్
మీదుగా బొబ్బిలి పట్టణంకు అనుమతిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
అనంతరం, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గొల్లపల్లి లోని శ్రీ దాడితల్లి అమ్మవారి ప్రధాన ఆలయం, వనం గుడిలను
సందర్శించి, భక్తుల క్యూ లైన్స్, బందోబస్తు ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించారు. భక్తుల క్యూ లైన్స్ కోసం ఏర్పాటు
చేస్తున్న బ్యారికేడ్లు పటిష్టంగా వేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. సిరిమాను తయారీ
ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించి, సిరిమాను తిరిగే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖాధికారుల
సహాయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ వెంట బొబ్బిలి డిఎస్పీ జి.భవ్య, బొబ్బిలి ఇన్స్పెక్టరు కే.సతీష్ కుమార్, బొబ్బిలి రూరల్ ఇన్స్పెక్టరు
కే.నారాయణరావు, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

0
77 views