logo

సిపిఐ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని, ఏదులాపురం కు చెందిన బుడిగం వెంకటేశ్వర్లకు రూ.38 వేల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కును స్థానిక సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ క్రాస్ రోడ్డు లోని సిపిఐ కార్యాలయం వద్ద లబ్ధిదారుడికి అందించడం జరిగింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఆసుపత్రి చికిత్స కోసం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ గారి సహకారంతో గౌరవనీయులైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సిఫారసు ద్వారా మంజూరు అయింది. అందజేసిన వారిలో సిపిఐ నేతలు మిడకంటి చిన్న వెంకటరెడ్డి, దండి రంగారావు, వెంపటి సురేందర్, వెన్నం భాస్కర్ ,చెరుకుపల్లి భాస్కర్ ,పుచ్చకాయల సుధాకర్ ,తోట రామాంజనేయులు, వెంపటి రాము, వెంపటి వెంకన్న, మేళ్లచెరువు రవి , నారా పొంగు యాకూబ్, యువజన సంఘం సభ్యులు మిరియాల నరుణ్ తేజ్, పొన్నెకంటి రమేష్, రెబ్బగొండ్ల గోపి తదితరులు ఉన్నారు.

0
35 views