
కుల గణాంకణ మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం
బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యన్నారాయణ
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
కుల గణాంకణ మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం
బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యన్నారాయణ
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
మోదీ నేతృత్వంలో ఇటీవలే తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కుల గణాంకణ అని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యన్నారాయణ అన్నారు.
సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ బీసీ కులానికి చెందిన సంఘాలు దశాబ్దాల కాలం నుంచి వేచి చూస్తున్న తరుణంలో మోదీ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకోవడం శుభతరుణమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 60శాతం ఉన్న బీసీ లకి ఉన్న హక్కులని పరిరక్షించేందుకు ఇతర సంక్షేమ పదకాల అమలు కొరకు మోదీ మంచి నిర్ణయం తీసుకోవటం శుభ పరిణామం కొనియాడారు. 1931నుంచి ఎలాంటి గణంకాలు తీసుకోకుండా ఊహ జనకంగా మాత్రమే ఉంచారని, కాంగ్రెస్ చేసిన నిర్లక్ష్యం తో బీసీ లకి అన్యాయం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఆధారంగా గణంకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
102 వ రాజ్యాంగ సవరణ ఆధారంగా బీసీలకున్న హక్కులని గణంకాల తో సాధ్యమవుతుందని చెప్పారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం లో బీసీ ల కున్న హక్కులని సైతం కాంగ్రెస్ తుంగలో తొక్కిందని చరిత్రను గుర్తు చేశారు. బీసీ లని మోసం చేసిన ఘనత కాంగ్రెస్ కి దక్కిందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎప్పుడు బీసీ లకి సంబంధించి కమిషన్ వేయలేదన్నారు. మోదీ మాత్రం బీసీ ల్లో అట్టడుగు ఉన్న కులాల ని వెలుగులోకి తీసుకొచ్చేలా రోహిణి కమిషన్ ని నియమించడం జరిగిందన్నారు. ఈ కమిషన్ ద్వారా అట్టడుగు వర్గాల వారిని సైతం కేటగిరీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.
బీసీ ల్లో విద్యా,ఉపాధి, సంక్షేమ పథకాలు అమలు చేయటానికి ఈ గణంకాలు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ
ఈ గొప్ప కార్యానికి ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, బీజేపీ నేత కోమటి రవి కుమార్ పాల్గొన్నారు.