logo

కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన : మంత్రి తుమ్మల, మాజీ మంత్రి వనమా,

తెలంగాణ స్టేట్** భద్రాద్రి జిల్లా **కొత్తగూడెం టౌన్**( మే 04)


కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన
: మంత్రి తుమ్మల, మాజీ మంత్రి వనమా,

*కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే, గురుదక్షిణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ చేకూరి కాశయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన, అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు , మాజీ మంత్రి శ్రీ వనమా వెంకటేశ్వరరావు మరియు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు
*ఈ సందర్భంగా మాజీ మంత్రి వనమా మాట్లాడుతూ చేకూరి కాశయ్య నిబద్ధత గల నిజాయితీ గల నాయకుడని, వారితో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషం అనిపించిందని వారి విగ్రహాన్ని కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఏర్పాటు చేసేందుకు నా సహకారం ఉండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
*వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా అందరికీ సుపచరితుడు శ్రీ చేకూరి కాశయ్య కౌంస్య విగ్రహాన్ని, కొత్తగూడెం నడిబొడ్డులో విగ్రహ ప్రతిష్ట ఏర్పాటుకు మాజీ మంత్రి వనమా కృషి అమోఘమని, అధికారులు వద్దన్నా కూడా పట్టు పట్టి చేకూరి కాశయ్య విగ్రహ ప్రతిష్ట కు వనమా ఈ స్థలాన్ని కేటాయించడం చాలా సంతోషమని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు రుక్మందర్ బండారి, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగబాబు, గౌస్, హుస్సేన్, మజీద్, బొమ్మిడి రమాకాంత్, బంధుగుల శ్రీధర్, B. శీను, హైమత్ వినోద్, సురేందర్, ఆవునూరు చంద్రయ్య, దూడల కిరణ్, జానీ, అశోక్, నగేష్, వాసు మల్ల గౌతం తదితరులు పాల్గొన్నారు.

435
12357 views