logo

అవుకు చెన్నకేశవ స్వామి ఆలయాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాం : మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

నంద్యాల జిల్లా/అవుకు (AIMA MEDIA ):
అవుకు పట్టణంలోని పురాతన శ్రీ భూదేవి సమేత చెన్నకేశవస్వామి.. ఆలయాన్ని అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. నేడు దేవాలయ అభివృద్ధిపై మంత్రి చెన్నకేశవ స్వామి ఆలయంలో ఎండోమెంట్, పోలీస్ అధికారులతో & రైతు సంఘంతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెన్నకేశవ స్వామి ధూప దీప నైవేద్యాలకు తన సొంత నిధులు వెచ్చించి నిర్వహిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇక నుంచి తిరునాళ్ల ఉత్సవాలను దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కంటే అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. అవుకు చెన్నకేశవ ఆలయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మంత్రి తెలిపారు.. అలాగే ప్రత్యేకంగా ఆలయానికి ఒక నూతన కమిటీని నియమిస్తామన్నారు.. ఆలయ మాన్య భూములపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఆలయంలోని సమస్యలను గుర్తించి అభివృద్ధి చేసి తీరుతామన్నారు. ప్రజలు ఎవరైనా పెళ్లిళ్లు చేసుకునేందుకు వీలుగా షెడ్డు, ఒక హాల్ నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించి అభివృద్ధి చేస్తామన్నారు.ఈ నెల 9 వ తారీఖు నుండి మొదలై 16వ తేదీ వరకు జరిగే శ్రీ భూలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు.. అవుకు చరిత్రలో జరగని విధంగా అంగరంగ వైభవంగా జరిగేందుకు నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ జిల్లా అధికారులు, సీఐ మంజునాథ్ రెడ్డి, ఎస్సై రాజారెడ్డి, అవుకు మండల టిడిపి అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి, చల్లా విజయ భాస్కర్ రెడ్డి, పట్టణ టిడిపి నాయకులు వెంకటరమణ నాయక్, అరవింద్ నాయక్, తిక్కన్న, దంతెల రమణ, బశెట్టి శ్రీరాములు, బత్తిన మద్దిలేటి గౌడ్, టిడిపి నాయకులు, కార్యకర్తలు బీసీ అభిమానులు పాల్గొన్నారు.

0
134 views