logo

Match

ఐపీఎల్ 2025 పడి లేస్తూ కాదు.. పూర్తిగా ఓటమి బాట పట్టడం.. ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు ఓ సారి అలా లేచి నిలబడి.. మళ్లీ పడిపోవడం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కథగా మారింది. గత మ్యాచ్‌లో చెన్నై జట్టును దాని సొంతగడ్డపైనే ఓడించి మాల్దీవుల్లో పర్యటనకు వెళ్లొచ్చిన ఆరెంజ్ టీమ్.. తాజాగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచులో గుజరాత్‌ టైటాన్స్ పై ఓడిపోయింది. ఆ జట్టు 38 పరుగుల తేడాతో చిత్తైంది.
అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇంకా స్వల్ప అవకాశాలున్నాయి.ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ -3లో బలంగా ఉన్నాయి. నాలుగో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. మరి సన్ రైజర్స్ ఈ రేసులో రావాలంటే... ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 7 ఓటములతో పాయింట్ల పట్టికలో6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. సన్ రైజర్స్ ప్రస్తుతం నెట్ రన్ రేట్ -1.192గా ఉంది. అంటే ఇంకా ఆ జట్టు నాలుగు మ్యాచులు ఆడాలి. ఆ నాలుగు మ్యాచుల్లోనూ ఆ జట్టు గెలిస్తే మొత్తంగా సన్ రైజర్స్ ఖాతాలో 14 పాయింట్లు వచ్చి చేరుతాయి.

0
0 views