logo

ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి మత సామరస్యం వెళ్లివిరియాలి...

రాయచోటిలోని శ్రీ హజరత్ సయ్యద్ యూసుఫ్ షా ఖాదరి దర్గాలో ఉరుసు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి.

రాయచోటిపట్టణం లోని బండ్లపెంటలో వెలసిన శ్రీ శ్రీశ్రీ హజరత్ సయ్యద్ యూసుఫ్ షా ఖాదరి దర్గా ఉరుసు సంధర్బంగా శుక్రవారం మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,కౌన్సిలర్లు, మైనారిటీ సోదరులుతో కలసి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి చాదర్ సమర్పించారు.దర్గాకు విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డికి దర్గా కమిటీ ఆత్మీయ స్వాగతం పలికి ఆయన చేత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహింపచేసారు.
ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీకాంత్ రెడ్డి ప్రార్థనలు చేశారు. మత సామరస్యం వెళ్లి విరియాలని ఆయన ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో గంధము, ఉరుసు కార్యక్రమాలను నిర్వహిస్తున్న దర్గా కమిటీని శ్రీకాంత్ రెడ్డి అభినందించారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, వైఎస్ఆర్ సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొలిమి హారూన్ బాష, కౌన్సిలర్లు కొలిమి చాన్ బాష, షబ్బీర్,రియాజ్, అన్నా సలీం, ఇర్ఫాన్,సుగవాసి ఈశ్వర్ ప్రసాద్,సుగవాసి శ్యామ్, టెలికాం సభ్యుడు అబుజర్, పట్టణ అధ్యక్షుడు నవాజ్ , కో ఆప్షన్ సభ్యుడు అయ్యవారు రెడ్డి, యూత్ అధ్యక్షుడు కొత్తపల్లె ఇంతియాజ్, యూసుఫ్ ఖాన్,
బేపారి అసద్, జమాల్ బాష, దర్గా కమిటీసభ్యులు ఇషాక్, మహబూబ్ అలీ, ఫాహేద్, మహబూబ్ ఖాన్,ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు

0
36 views