logo

తాటి ముంజి వల్ల ఉపయోగాలు సీజనల్ ఫ్రూట్. శరీరంలో టాక్సిన్స్ వదిలించుకోవటానికి సహాయపడుతుంది*

తాటి ముంజ: సీజనల్ ఫ్రూట్, ఇది శరీరంలో టాక్సిన్స్ వదిలించుకోవడానికి సహాయపడుతుంది, ఇది శరీరం యొక్క సహజ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. ఐస్ యాపిల్ లేదా నంగు సహజ శీతలకరణి, ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది .తాటి ముంజెల వల్ల కలిగే ఆరోగ్య లాభాలు
►తాటి ముంజెలు ఎండధాటి నుంచి రక్షణ కల్పిస్తాయి.
►100గ్రాముల ముంజెల్లో 43 కేలరీలు ఉంటాయి.
►మూడు తాటి ముంజెలు తిన్నట్లయితే, ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది.
►లేత తాటిముంజెల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా నీరే ఉంటుంది.
►వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
►బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజెలు చక్కని ఫలహారం.
►ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటిముంజెల నీటిని పట్టిస్తే దురద తగ్గి, అవి త్వరలోనే మానిపోతాయి.
►కొన్ని ప్రాంతాల్లో తాటిముంజెలతో శీతలపానీయాలను కూడా తయారు చేస్తారు. తమిళనాడులో తాటిముంజెల పానీయాన్ని ‘ఎలనీర్‌ నుంగు’ అంటారు.
మరి అలాంటప్పుడు అందరూ కూడా ఈ సీజన్ లో వస్తున్న తాటి ముంజలు తిందామ్...

0
77 views