logo

భాను ప్రతాప బాధితులకు చల్లని మజ్జిగతో ఊరట కలిగిస్తున్న సనాతన సేవా కేంద్రం.

తేదీ 29-05-2025 :శేరిలింగంపల్లి, చందానగర్: హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ సంవత్సరం అన్ని సంవత్సరాలతో పోలిస్తే భాను ప్రతాపం చండ ప్రచండ తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. నిద్రలేచిన దగ్గర్నుంచి ప్రజలు బజారు నుండి తెచ్చుకోవలసినటువంటి సరుకు సామాగ్రి పై దృష్టి మరాల్చాల్సి వస్తుంది . ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్లి తెచ్చుకోవలసిన సామాగ్రిని తెచ్చుకోవడానికి ఎండ వేడిమి తాకిడికి తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 8,9 గంటల లోపు దుకాణాలు తీయటం అరుదు. 9 గంటలు దాటిన దగ్గర నుంచి ఆదిత్యుని అరంగేట్రం, అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఇది గమనించిన కొంతమంది వితరణ శీలురు చందానగర్ మంజీరా రోడ్డులో బాటసారులకు చల్లని మజ్జిగ ఇచ్చి, తమ సహృదయాన్ని సౌబ్రాతృత్వాన్ని చాటి చెప్పుకోవటం శ్లఘనీయమయిందని అనక తప్పదు.మజ్జిగను త్రాగిన బాటసారులు వితరణ శీలురులను మనసారా అభినందించి, ఇలా చేయడం చాలా మంచి కార్యక్రమమని వారిని ప్రతి ఒక్కరూ కొనియాడారు .

0
66 views