logo

ఉద్యోగ భద్రత కల్పించండి కలెక్టరేట్ ఎదుట ఎంహెచ్ఓల దీక్షలు

ఉద్యోగ భద్రత కల్పించండి
కలెక్టరేట్ ఎదుట ఎంహెచ్ఓల దీక్షలు
చిత్తూర్: ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సోమవారం నుండి జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు కల్పనా మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సేవలను మెరుగుపరిచేలా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరిట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. ఆరు సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న కనీస వేతనాలు అందడం లేదని 6 వేలు,11 వేల రూపాయల జీతం ఇస్తూ ఇబ్బందుల గురి చేస్తున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల మేరకు ఆరు సంవత్సరాలు పనిచేసిన వారిని క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్న ఏమాత్రం పట్టించుకోవడంలేదని వాపోయారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరపాలని అలాగే పని ఆధారిత ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దెల బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అమలు చేయాలన్నారు. ఎఫ్ ఆర్ ఎస్ నుండి సిహెచ్ వాళ్లకు మినహాయింపు ,
హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఎక్స్గ్రేషియో, మెటర్నటీ సెలవులు ఇవ్వాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన సమ్మెలో జిల్లా వ్యాప్తంగా సిహెచ్వోలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కీర్తి, అరుణ, దివ్య లతో పాటు పెద్ద సంఖ్యలో సిహెచ్వోలు పాల్గొన్నారు.

7
2342 views