logo

ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా ఎస్.జె. డబ్ల్యూ. హెచ్.ఆర్.సి ప్రతినిధుల నిరసన:-

ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా ఎస్.జె. డబ్ల్యూ. హెచ్.ఆర్.సి ప్రతినిధుల నిరసన:-


సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం, నేషనల్ జనరల్ సెక్రెటరీ మామిడాల మనోహర్, సౌత్ ఇండియా చైర్మన్ గంప హనుమా గౌడ్ సూచనలు మేరకు,భైంసా పట్టణంలో ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేసిన ప్రతినిధులు.ఈ సందర్భంగా డాక్టర్ సాప పండరి మాట్లాడుతూ ఈ రోజు మరణించింది కేవలం సామాన్యులు మాత్రమే కాదని, భారతదేశ ఆత్మగౌరవమని, మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని,గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు.దేశ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండి మతోన్మాదులను మట్టుబెట్టాలని,బాధితులకు, ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేశారు. అనంతరం ప్రతినిధులు ఖబర్దార్ ఖబర్దార్ ఉగ్రవాదులరా! ఖబర్దార్-ఖబర్దార్ ఖబర్దార్ మతోన్మాదులారా! ఖబర్దార్..... మా దేశం వైపు కన్నెత్తి చూస్తే, మట్టిలో నలిపేస్తామని అంటూ నినాదాలు చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా చైర్మన్ ఏ.సుదర్శన్, డైరెక్టర్ ఠాగూర్ దత్తు సింగ్, బైంసా మండల ప్రెసిడెంట్ అడెల్లి సాయికిరణ్, లీగల్ అడ్వైజర్ గంధముళ్ల ప్రకాష్, స్థానికులు చామనపల్లి మనోజ్, చంద్రే విశ్వంభర్, బోసి మహేష్ పలువురు పాల్గొన్నారు

4
677 views