
సౌకర్యాలు మిన్న చదువులు సున్నా పందాలో సాగుతున్న ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాల అంటేనే అన్ని సౌకర్యాలు ఉచిత యూనిఫామ్ ఉచిత పుస్తకాలు విశాలమైన తరగతి గదులు సువిసాలమైన ఆటస్థలం. అనుభవజ్ఞులైన అధ్యాపకులు మండల ,జిల్లా, అధికారుల పర్యవేక్షణలో ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దే భావి భారత పౌరులను తయారు చేస్తున్న దేవాలయాలు ఇది ఒకప్పటి మాట నిజంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కొందరు ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు పంపిస్తున్నారు ఇన్ని వసతులున్న ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చదివించడం లేదు అంటే వీళ్లు చెప్పే విద్య పైన వీళ్ళకే నమ్మకం లేదా ఉద్యోగాలు ప్రభుత్వాన్ని కావాలి జీతాలు ప్రభుత్వం ఇవ్వాలి పిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాం మీ పిల్లల్ని మా బడిలో జాయిన్ చేయండి ఉత్తములుగా తీర్చిదిద్దుతాం అంటూ చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి తప్పుడు పనులు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారా అలాంటప్పుడు మీ పిల్లలను మా స్కూలుకు పంపండి మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి అని ప్రచారం చేసే హక్కు మీకు ఉందా అంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. అన్ని వస్తువులు ఉన్న పాఠశాలలో పరీక్షా ఫలితాలు తక్కువగా ఉంటే ఏ వస్తువులు లేని ఎటువంటి విద్యార్హతలు లేని ప్రైవేటు పాఠశాలలో పరీక్ష ఫలితాలు జిల్లా స్థాయి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం ఎందుకు పొందుతున్నాయి. ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని జీతం 60 వేలు అనుకుందాం అతను వెళ్లి 6000 కి పని చేసే ప్రైవేటు ఉపాధ్యాయుని వద్దకు వెళ్లి మా పిల్లలు ఎలా చదువుతున్నారు అని అడుగుతున్నారు అంటే లోపం ఎవరిలో ఉన్నది అనేది వారి మనస్సాక్షికే వదిలేయాలి. విశాలమైన ఆటస్థలం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రభుత్వం కల్పించే అన్ని సదుపాయాలు ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం 82 ఉంటే ఎటువంటి ఆటస్థలం గాని పూర్తిస్థాయి ఉపాధ్యాయులు గాని ప్రభుత్వ వసతులు లేని కొన్ని పాఠశాలల్లో ఉత్తీర్ణత 100% గాఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణ జరిపి కనుమరుగవుతున్న ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని కోరుకుందాం