ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
గంట్యాడ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ట్రాక్టర్ డ్రైవర్ వర్రి రామారావు (50) గ్రావెల్ లోడుతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మదనాపురం రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి రామారావు తలపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.