
*జి. ఓ. నంబర్ 4 తో పారా క్రీడాకారులకు బంగారు భవిష్యత్ *
*హర్షం* *వ్యక్తం* *చేసిన* *పారా* *స్పోర్ట్స్* *అసోసియేషన్* *జిల్లా* *గౌరవ* *అధ్యక్షులు* *దయానంద్* :
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారా క్రీడాకారులకు 3 శాతం ఉద్యోగాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జి. ఓ. నంబర్ 4 ను విడుదల చేయడం పట్ల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె. దయానంద్ హర్షం వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆదివారం వుడాకోలనిలో గల సారధి వెల్ఫేర్ బ్లైండ్ హాస్టల్ లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పారా క్రీడాకారులకు స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం రాష్ట్ర స్థాయి విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. అనంతరం నిర్వాహకులు దయానంద్ ను ఘనంగా సత్కరించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో పారా క్రీడలకు ఏ రాష్ట్రంలోనూ అమలులో లేని స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చి ప్రోత్సాహలు అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరో అడుగు ముందుకేసి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్టీకి జి. ఓ. ఎం. ఎస్.నంబర్ 4 జారీ చేయడం ద్వారా పారా క్రీడాకారుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని, పెద్ద మనసును మరోసారి చాటుకుందని ఆనందం వ్యక్తం చేసారు. ఈ జి. ఓ. తో పారా క్రీడాకారులకు నూతన ఉత్సాహం, మనో ధైర్యంతో బాటు భవిష్యత్ పట్ల భరోసా కలిగిందని, దివ్యంగుల చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు. జి. ఓ. విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు కు, మంత్రి లోకేష్ కు, స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్‌రెడ్డికి, శాప్ చైర్మన్ ఏ.రవినాయుడుకు, శాప్ ఎం. డి. గిరీష కు కృతజ్ఞతలు తెలియజేసారు. అలాగే పదేళ్లుగా పారా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు కు, రాష్ట్ర కార్యదర్శి రామస్వామి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ నిర్వాహకులు ప్రదీప్, అమ్మ సేవా సమితి అధ్యక్షులు లక్కీ శేఖర్, మూర్తి, వెంకటరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.