logo

మైనారిటీ సంక్షేమ అధికారిగా షేక్ హిదాయతుల్లా

వైయస్సార్ కడప ఉమ్మడి జిల్లాల మైనారిటీ సంక్షేమ అధికారిగా షేక్ హిదాయతుల్లా శనివారం బాధ్యతలు స్వీకరించారు.

ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాల మైనారిటీ సంక్షేమ అధికారిగా నియమితులైన ఆయన.. శనివారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు వంటి అన్ని మైనారిటీ వర్గాల అభివృద్ధికి “ప్రభుత్వం చేపడుతున్న మైనారిటీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రతి అర్హులైన వ్యక్తికి చేరేలా పని చేస్తానని తెలిపారు ప్రజలకు సేవ చేయడం నా ప్రథమ కర్తవ్యం” అని తెలిపారు మైనారిటీ విద్యార్థులకు విద్యావేతనాలు, ఉపకారవేతనాలు, వృత్తిపరమైన శిక్షణలు, మైనారిటీ మహిళల ఆర్థిక అభివృద్ధి తదితర పథకాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన తెలిపారు.ఉమ్మడి జిల్లాలోని మైనారిటీ వర్గాలకు పునాదిస్థాయిలో సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రజలు మైనారిటీ సంక్షేమ శాఖతో ఏవైనా సమస్యలు లేదా సమాచారం కోసం జిల్లా కలెక్టరేట్లో ఉన్న తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించారు.
పిఆర్వో, స.పౌ.సం. శాఖ., వైఎస్ఆర్ జిల్లా.

0
24 views