logo

ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా ప్రజా ఫిర్యాదులు వేదిక బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ జె వెంకట మురళి గారు ఆధ్వర్యంలో 21-04-25. చీరాల మున్సిపాలిటీ ఆఫీసులో గ్రీవెన్స్ డే పెట్టినారు ఇది ప్రజలు గమనించగలరు.

Aimamedia:
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గౌరవనీయులైన మన జిల్లా కలెక్టర్ శ్రీ జె వెంకట మురళి గారు మన చీరాల పురపాలక సంఘానికి 21/4/2025 ఉదయం 10 గంటలకు వచ్చి ప్రజల వద్ద నుండి ఆర్జీలు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉన్నారు.కావున మన గో బంధువులు /గోపరి రక్షకులు /సనాతన ధర్మ పరిరక్షకులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సకల దేవతల స్వరూపమైన గోమాతలు సరైన వసతి/ ఆహారం // నీరు లేకపోవడంతో అనుభవిస్తున్న దుర్భర పరిస్థితిని గురించి మరియు రోడ్లు వెంబడి తిరుగుతూ ప్రమాదాలకు గురి అవుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్న పరిస్థితిని వివరిస్తూ గౌరవనీయులైన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించడం జరిగినది.కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా 21/ 4/ 25 సోమవారం ఉదయం కచ్చితంగా ఉదయం 10 గంటలకు హాజరయ్యి సకల దేవతల స్వరూపమైన ఆ గోమాతల కృపాకటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరడమైనది మరిన్ని వివరములకు మరియు మీ హాజరు గురించి ఈ క్రింది నెంబర్లు ఫోన్ ద్వారా గాని వాట్సప్ ద్వారా గాని సంప్రదించవలసిందిగా కోరడమైనది.ఇదేవిధంగా మీ హాజరు గురించి ఈ క్రింది ఇచ్చిన లింకు ద్వారా కూడా తెలియజేయగలరు 🌿💐🙏ఇట్లు చీరాల గోపరిరక్షణ సమితి 9866 424 525 ప్రజలందరూ ఇది గమనించగలరు బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీసులో పెట్టాల్సిన గ్రీవెన్స్ డే ఈ సార్ చీరాలలో పెడుతున్నారు.

0
0 views