logo

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులుగా బుర్రెమ్ బాలరాజ్..

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, డెస్క్ : జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఏఐటీయూసీ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎమ్ఎ యూసుఫ్ తెలిపారు. నూతన అధ్యక్షులుగా పిట్లం మండల కేంద్రానికి చెందిన బుర్రెమ్ బాలరాజ్, ప్రధాన కార్యదర్శిగా పి.బాల్రాజ్, ఉపాధ్యక్షులుగా యల్. దశరథ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా దుబాస్ రాములును ఏకగ్రీవంగా నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.బాల్రాజ్. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమయ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

4
178 views