
వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం - మాజీ ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ గారు
వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం - మాజీ ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ గారు
• ముస్లిం సమాజానికి అణగదొక్కాలని కుట్ర
• రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలకు న్యాయం చేస్తానని ప్రమాణం చేసిన నాయకులు ఈరోజు అదే రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలు తెస్తున్నారు
• కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలి
• ఈ బిల్లును సమర్తించిన తెలుగుదేశం పార్టీ ముస్లిం సమాజానికి మోసం చేసింది
• మసీదులకు వచ్చి ఇఫ్తార్ విందులు చేసిన నాయకులు రేపటి రోజు ఆ మసీదు మీదేనని నిరూపించోకోండి అని అంటారు.
• దేశంలో ఏ సమస్యలు లేనట్టు ముస్లిం సమాజానికి ఉద్ధరిస్తారట.
• ముస్లిం శ్రేయస్సు ఈ బిల్లు అని చెప్పేవారు వారి పార్టీల్లో ఎంతమందికి ఎమ్యల్యేలుగా ఎంపీలుగా చేసారో సమాధానం చెప్పాలి.
• తెలుగు దేశం పార్టీ చేసిన ఈ మోసాన్ని ముస్లిం ప్రజలు ఎప్పటికి మర్చిపోరు
• ఇప్పుడు స్పందించకపోతే భవిష్యత్తు తరాలకు మోసం చేసినవాళ్ళం అవుతాం.
• ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూడకుండా అందరం కలిసి కట్టుగా పోరాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బిల్లును ఉపసంహరించుకునేలా చేద్దాం.
• ఈ బిల్లును సమర్తించిన పార్టీలకు రాబోయే ప్రతి ఎన్నికల్లో ఓటు తో గట్టిగా బుద్ది చెప్పలని కోరుకుంటున్నాను
మాజీ ఏపీ ఆగ్రోస్ నవీన్ నిశ్చల్ గారి ఆధ్వర్యంలో, ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులకు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ పంపిణీ చేయడం జరిగింది