
ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు గా నూతనంగా ఎన్నుకోబడిన శ్రీ కొండముది బంగారు బాబు గారికి సన్మాన కార్యక్రమం🌹
జిల్లా బిజెపి నూతన అధ్యక్షులు కొండముది బంగారు బాబు గారి సన్మాన కార్యక్రమం 🙏 అద్దంకి పట్టణం, బాపట్ల జిల్లా. ఈరోజు అనగా గురువారం సాయంత్రం ఐదు గంటలకు బిజెపి యువమోర్చరాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమదాని శ్రీరామ్ గారి కార్యాలయంలో బాపట్ల జిల్లా నూతన బిజెపి అధ్యక్షులు బంగారు బాబు గారికి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా నూతన అధ్యక్షులు బంగారు బాబు గారు హాజరై సన్మానాన్ని స్వీకరించడంతోపాటు బాపట్ల జిల్లాలో బిజెపిని గ్రామస్థాయి వరకు అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోని టాప్ టెన్ జిల్లాలలో ఒకటిగా నిలబెట్టడానికి విశేషంగా కృషి చేస్తానని ఈ కృషిలో భాగంగా పార్టీ కోసం చురుకుగా కదిలే ప్రతి సామాన్య కార్యకర్తను కూడా భాగస్వామ్యం చేసి ముందుకెళ్తానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమదాని శ్రీరామ్ మాట్లాడుతూ బంగారు బాబు గారు యువ మోర్చా నుండి తన ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు బిజెపి జిల్లా అధ్యక్షులుగా ఎదగడం వరకు బంగారు బాబు గారు చేసిన కృషిని, పార్టీ కోసం తాను పడ్డ శ్రమని పార్టీపట్ల బంగారు బాబు గారి విధేయతను వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాతులూరు భావనారాయణ గారు, యువమోర్చా మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయ రాజుగారు, యువ మోర్చా అంకరాజు గారు, యువమోర్చా సాయి గారు, యువ మోర్చా రిషి గారు, యువ మోర్చా చిన్న సైదా గారు, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరపల్లి సురేష్ గారు, పల్లపోతుల రమేష్ బాబు గారు, పార్టీ సీనియర్ నాయకులు తమ్మన శ్రీనివాస్ రావు గారు, బెల్లంకొండ శ్రీనివాస్ రావు గారు, మక్కెన శ్రీనివాసరావు గారు, అశ్వత్ నారాయణ గారు, పుట్ట ఏడుకొండలు గారు, ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ గారు తదితరులు 25 మందికి పైగా బిజెపి నాయకులు, కార్యకర్తలు యువమోర్చా నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. హాజరైన ప్రతి ఒక్కరికి అద్దంకి నియోజకవర్గ యువ మోర్చా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏