logo

🌹 గుడ్ ఫ్రైడే శుభదినంగా పాస్టర్లకి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు జి గౌరవ వేతనం విడుదల చేసినారు 🌹

గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్‌లకు కూటమి సర్కార్ శుభవార్త వినిపించింది.

8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం విడుదలకు సీఎం చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 7 నెలలకు గాను ఒకొక్క పాస్టరుకు రూ.35,000 చొప్పున లబ్ధి చేకూరుతుంది. యువగళం పాదయాత్రలో పాస్టర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశాల్లో గౌరవ వేతనం అందిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం హామీని అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఏ పార్టీతో పొత్తు ఉన్న చెప్పారంటే చేస్తారంతే" ఎలక్షన్లో వాగ్దానం చేసిన ప్రకారం పాస్టర్లకు గౌరవ వేతనం విడుదల చేసినారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్

0
0 views