అరకు: కెకె లైన్ ను పరిశీలించిన ఈస్ట్ కోస్ట్ జోన్ సేఫ్టీ ఆఫీసర్
కెకె లైన్ లో ఎస్.కోట నుండి పాడువా వరకు రైల్వే లైన్ సేఫ్టీ చెకింగ్ గురువారం రైల్వే అధికారులు నిర్వహించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఛీప్ సేఫ్టీ అధికారి అరుణ్ కుమార్ రాథోడ్ కెకె లైను లోని అరకు స్టేషన్ వద్ద ట్రాక్ చేంజింగ్ సిస్టం ను చెకింగ్ చేశారు. సేప్టీ చెకింగ్ లో బాగంగా ప్రత్యేక రైలులో కెకె లైన్ లోని ట్రాక్ ను పరిశీలించారు. సేప్టీ అధికారి వెంట ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు ఉన్నారు.