ముస్లింల దీక్షలకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మద్దతు
దేశవ్యాప్తంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ముస్లింలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వైసిపి మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి ముస్లింల దీక్షలకు మద్దతు తెలియజేస్తూ అవసరమైతే తాము కూడా ఈ పోరాటాల్లో పాలుపంచుకుంటామని తెలిపారు ఇప్పటికే తమ పార్టీ సుప్రీంకోర్టులో ముస్లింలకు అనుకూలంగా పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు దేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున ప్రాణత్యాగాలు చేసి స్వసంత్రం సాధించడం అందరికీ తెలిసిందేనని హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని అందులో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లు 2025 ను బిజెపి మిత్రపక్షం లతో ఆమోదించడం జరిగిందని ఆయన తెలిపారు. కులమతాలకతీతంగా భారతీయులందరూ ఒకటిగా ఉండాలని కోరారు.