మవులి మా జాతర ప్రారంభం
జయపురం: జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్ శాశనసభ నియోజకవర్గ పరిధి ఛతర్ల గ్రామ పంచాయతీ పటకికుంబ గ్రామం ప్రాంతంలో గల మవులి కోట మందిరంలో మవులి మా జాతర బుధవారం ప్రారంభమైంది. ఈ జాతరలో కొట్‌పాడ్, కుంఽద్ర సమితుల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ జాతరలో ప్రముఖ కాంగ్రెస్ నేత, కొట్‌పాడ్ సమితి మాజీ అధ్యక్షుడు నీలకంఠ పూజారి, మాజీ కౌన్సిలర్‌లు దేవీప్రసాద్ నాయక్, నరేంద్ర మఝి, యువజన కాంగ్రెస్ నాయకుడు కాళీ కృష్ణ తదితరులు అమ్మవారికి పూజలు చేశారు. కమసాయి బిశాయి, బుద్ర సిరా, జగన్నాథ్ గౌడ, రామచంద్ర దురువ, వార్డు మెంబర్ రామ భూమియ తదితరులు మవులి మా జాతరను నిర్వహించారు. ఈ జాతరలో పలు ప్రాంతాల నుంచి వందలాది మంది ప్రజలు పాల్గొని మవులి మాకు పూజలు చేశారు.