logo

పశువుల పట్టివేత

టెక్కలి : కోటబొమ్మాళి మండలం నారాయణవలస సమీపంలో వ్యాన్‌లో 13 ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేర కు కోట బొమ్మాళి ఎస్‌ఐ వి.సత్యనారాయణ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. పశువులను తరలిస్తున్న వ్యాన్‌ను ఆపగా 12 మగదూడలు, ఒక ఆవు ఉన్నట్లు గుర్తించి వాటిని విజయనగరం జిల్లా కొత్తవలస గోశాల కు తరలించారు. అనంతరం ఆవులు అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు

0
0 views