logo

పాడేరు: స్టేడియం, ఆలయ నిర్మాణాలకు భూమి కేటాయించాలని కలెక్టర్ కు వినతి

పాడేరు, అరకు పరిసరాల ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి 15 ఎకరాలు భూమి కేటాయించాలని జిల్లా కలెక్టర్ ను జిసిస్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ కోరారు. అలాగే క్రీడాకారుల నైపుణ్య శిక్షణ కోసం పాడేరు లో క్రికెట్ స్టేడియం కు 10 ఎకరాలు భూమి కేటాయించాలని బుధవారం జీసీసీ చైర్మెన్ కలెక్టర్ ను కలిసి తెలిపారు. క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ఏసీఏ వాళ్లతోను, మంత్రి నారా లోకేష్ తోనూ, ఆలయాల నిర్మాణానికి టీటీడీ ఈఓ తోను ఇప్పటికే మాట్లాడి ఉన్నామని కలెక్టర్ కు తెలిపారు. భూమి కేటాయించినట్లయితే నిర్మాణాలు ప్రారంభమౌతుందని కిడారి పేర్కొన్నారు. రెవెన్యూ శాఖతో మాట్లాడి భూముల కేటాయింపుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జీసీసీ చైర్మన్ వెంట బాకూరు సర్పంచ్ వెంకటరమణ రాజు, దారెల సర్పంచ్ పాండురంగ స్వామి, అండిబ సర్పంచ్ తామర్ల సత్యనారాయణ, గూడా సర్పంచ్ జ్ఞాన ప్రకాష్ తదితర నాయకులు ఉన్నారు.

0
0 views