ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పం వికాసితభారత్ 2047 - ముఖ్యమంత్రి
తేదీ : 15 ఏప్రిల్ 2025 - కాకినాడ జిల్లా:
ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకాదినకర్ గారు కాకినాడ జిల్లాలో “ కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబందించిన అంశాల పైన జిల్లా కలెక్టర్ ఎస్. షాన్ మోహన్ గారి సమన్వయంతో సమీక్ష “ చేశారు, శాసనసభ్యులు నిమ్మకాయల చిన్న రాజప్ప గారు, శాసన మండలి సభ్యులు కర్రి పద్మశ్రీ గారు మరియు వివిధ శాఖల అధికారులు ఈ సమీక్ష కు హాజరయ్యారు.
ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పం వికాసితభారత్ 2047 - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్యేయం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో నిర్వహించే కార్యాచరణ ద్వారానే నెల్లూరు జిల్లా పరిధిలోని ఇప్పుడున్న సవాళ్లను అధిగమించి విజయవంతంగా “ వికసిత కాకినాడ జిల్లా “ గా రూపుదిద్దవచ్చు అనే లక్ష్యంతో సమీక్ష జరిగింది.
సమీక్షలో ఉపాధిహామీపథకం మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం మరియు 2019 - 24 మధ్య జరిగిన అవకతవకలు మరియు ప్రస్తుత అమలు తీరు పైన , ప్రతి గ్రామ పరిధిలోని ప్రతి గృహానికి సురక్షిత త్రాగు నీరు ఇచ్చే సంకల్పంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న జల్_జీవన్_మిషన్ అమలు తీరు , కాకినాడ పట్టణం లో స్మార్ట్ సిటీ మరియు అమృత్ పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు, అమృత్ 2.0 లక్ష్యాల పైన, గ్రామీణసడక్_యోజన, లాక్ పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్నయోజన, పీఎంసూర్యఘర్, కుసుమ్, పీఎంఆవాసయోజన, పీఎం విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు, జిల్లాను పోర్ట్ ఆధారిత వస్తు తయారీ కేంద్రంగా మలచడానికి , పర్యాటక రంగం అభివృద్ధి మరియు జిల్లాలో పారిశ్రామికీకరణ అభివృద్ధి తదితర అంశాల పైన జిల్లా కలెక్టర్ గారు మరియు అధికారులతో సమీక్ష చేయడం జరిగింది.
ఉపాధిహామీపథకం :
ఈ సంవత్సరం ఉపాధి హామీ బడ్జెట్ మెటీరియల్ కాంపోనెంట్ కోట్లలో ఇప్పటివరకు 126.69 కోట్లు వాస్తవ వ్యయం జరిగింది. అలాగే వేతనాల బడ్జెట్ లో 96% పూర్తి చేసుకొని 189.44 కోట్లు వాస్తవ చెల్లింపులు జరిగాయి. గత 5 సంవత్సరాలు ఉపాధి హామీ మెటీరియల్ మరియు లేబర్ కాంపోనెంట్ బడ్జెట్ మరియు వాస్తవంగా చేసిన ఖర్చు చేసిన వివరాలను మరియు నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసిన వివరాలు ఇవ్వమని అధికారులను ఆదేశించడం జరిగింది, గత 5 సంవత్సరాలలో మెటీరియల్ కాంపోనెంట్ వ్యయం ద్వార కల్పించిన ఆస్తుల నాణ్యత మరియు నిబంధనలకు విరుద్ధంగా చేసిన వ్యయం పైనా విచారణ చేయమని జిల్లా కలెక్టర్ కు చెప్పడం జరిగింది. ఒక రోజుకు ఉపాధిహామీ వేతనం రూ. 300 అయితే జిల్లాలో సగటున రూ. 253 ఈఇంకా పెంచేందుకు కృషి చేయాలి. అలాగే అర్హత కలిగిన కుటుంబానికి నిర్దేశిత 100 రోజుల పనిదినాలలో సగటున 45 రోజుల పనిదినాలు మాత్రమే వినియోగించుకున్నందున పనిదినాల వినియోగం పెంచాలని అధికారులకు తెలపడం జరిగింది. పల్లె పండుగ క్రింద సీసీ రోడ్లు లక్ష్యంలో 93 % సాధించి 146.42 కిమీ మరియు పశువుల షెడ్ల నిర్మాణం లక్ష్యానికి మించి 149% తో 1045 షెడ్లను పూర్తి చేసినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. నీటి నిర్వహణ పనులు చాలా మందకొడిగా ఫార్మ్ పండ్స్ లక్ష్యంలో 4% పూర్తి చేసుకొని 84 , సోక్ పిట్లు లక్ష్యంలో 24% పూర్తి చేసుకొని 955 మరియు రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ లక్ష్యంలో 31% పూర్తి చేసుకొని 39 పూర్తి చేశారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ లక్ష్యంలో 68% పూర్తి చేసుకొని 679.28 ఎకరాలను పూర్తి చేశారు. పంచ ప్రాధాన్యల క్రింద 2025 - 26 సంవత్సరానికి సగటు వేతనం రూ. 307/- లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
జల్ జీవన్ మిషన్ :
గత 5 సంవత్సరాలు జల్ జీవన్ మిషన్ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత లేకుండా 2019-24 మధ్య పనులు చేయడం వల్ల ప్రధాని నరేంద్ర మోదీ గారు నిర్దేశించిన లక్ష్యాలు నెల్లూరు జిల్లా చేరుకోలేక పోయింది. 2019 - 24 మధ్య గత ప్రభుత్వం 1,007 పనులను రూ. 498.59 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించి మొత్తం 526 పనులు పూర్తి అయినట్లు చూపుతున్న గణాంకాలు పనులలో నాణ్యత పైన అనుమానాలు వస్తున్నాయి, 481 పనులు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. జిల్లాలో మొత్తం గ్రామీణ ప్రాంతంలో 3.89 లక్షల గృహాలకు గాను 3.16 లక్షల గృహాలకు నీటి కుళాయిలు బిగించినట్లు, మరొక 73 వేల కుళాయిల పనులు జరుగుతున్నట్లు లెక్కలు ఉన్నా కుళాయిలలో నీరు రావడం లేదు అనేది నిజం , దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా పల్స్ సర్వే అనంతరం ప్రతి ఇంటికి సురక్షిత త్రాగు నీరు కుళాయి ద్వారా ఇవ్వాలంటే ఇప్పుడు రూ. 1,650 కోట్లు అవసరం అవుతున్నాయి అని అధికారులు ఇచ్చిన లెక్కలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం సకాలంలో నాణ్యతతో ప్రణాళిక బద్ధంగా పనులు చేయలేదు కాబట్టి ఇప్పుడు సవరించిన వ్యయంతో పనులు పూర్తి చేయవలసి వస్తుంది. ఇప్పటి వరకు 50 % పైగా పనులు పూర్తి అయ్యినప్పుడు 3.89 లక్షల గృహాలకు గాను 3.16 లక్షల గృహాలకు కుళాయిలు బిగిస్తే మరో రూ. 1,650 కోట్లు అవసరం అంటే నిబంధలు మేరకు పనులు అయ్యాయి అని ఎలా చెబుతారని అధికారులను అడగడం జరిగింది, పల్స్ సర్వే ప్రకారం సమాచారం లోపాలు లేకుండా ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
2019 - 24 మధ్య నాణ్యత లేకుండా పనులు చేయడం లేదా సకాలంలో పనులు పూర్తి చేయకపోవటం మరియు పురోగతి లేని కాంట్రాక్టులు రద్దు చేసి, దీర్ఘకాలిక నీటి వనరుల ఆధారంగా పనులు పునః ప్రారంభం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదు. పూర్తి చేశామని లేదా కొనసాగే పనులు అని చెప్పే పనుల నాణ్యత పైన సందేహాలు నివృత్తి కావలసి ఉంది.
గ్రామీణ సడక్ యోజన:
“ గ్రామీణ సడక్ యోజన “ కింద గ్రామాలలో రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరగాల్సినటువంటి అవసరం ఉందని అధికారుల దృష్టికి తేవడం జరిగింది, 2020-21 నుండి ఇంకా దీర్ఘాకాలంగా ముగిలిపోయిన 4.52 కోట్ల రూపాయిల విలువైన 2 పాత పనులు త్వరగా పూర్తి చేయాలని తెలపడం జరిగింది . ఇప్పటివరకు అనుసంధానం కానీ గ్రామీణ రహదారులకు సంబంధించి జిల్లాలో గ్రామీణ సడక్ యోజన - III క్రింద 29.39 కోట్ల అంచనా వ్యయంతో 47.13 కిమీ సంబందించిన 7 పనులలో 9.66 కోట్లను ఇప్పటివరకు ఖర్చు చేశారు, 24 మీటర్లు సంబందించిన ఒక పని మొదలు పెట్టలేదు. ఈ పనుల పురోగతి పైన సమీక్ష జరిగింది.
పీఎం జన్మన్ ( ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ) క్రింద 16.10 కోట్ల విలువైన 3 పనులకు సంబంధించిన 19.15 కిమీ రహదారులు కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది.
లాక్ పతి & డ్రోను దీదీ :
జిల్లాలో స్వయం సేవ గ్రూపులలోని మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే “ లాక్ పతి దీదీ“ లుగా 1,38,267 మందిని గుర్తించినట్లు అధికారులు సమాచారం ఇచ్చారు, ఇందులో దాదాపు 70% మంది వ్యవసాయ అనుబంధ పనులలో ఉన్నారు.
4 డ్రోన్లను పైలట్ ప్రాజెక్ట్ క్రింద జిల్లాలో స్వయం సహాయక గ్రూపులకు శిక్షణ ఇచ్చి వీటి ద్వారా చిన్న, సన్నకారుల రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా డ్రోనుల వినియోగానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం డ్రోనుల పైన సబ్సిడీ ఇస్తుంది.
పీఎంఏవై & టిడ్కో :
పీఎంఏవై అర్బన్ మరియు గ్రామీణ్ క్రింద జిల్లాలో కేటాయించిన 85,482 గృహలకు, పూర్తి అయినవి 28,494 గృహాలు అయితే లబ్ధిదారులు నివసిస్తున్నది అంతంత మాత్రమే, 27,537 గృహాల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. నివాసయోగ్యమైన మౌలిక సదుపాయాల కల్పన లేక లబ్దిదారులు ఇబ్బంది పడుతున్నారు, మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే చర్యలను తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. 2019 - 24 మధ్య నాటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 2019 ముందు కేటాయించిన ఎన్టీఆర్ హౌసింగ్ లబ్దిదారుల దయనీయ పరిస్థితి పైన నివేదిక కోరడం అయినది, అవి పూర్తి చేయడానికి ఏమి చర్యలు తీసుకుంటున్నామని అధికారులను కోరడమైనది .
2019 - 24 మధ్య పాలన నిర్లక్ష్యం వల్ల జిల్లాలో 7,288 టిడ్కో గృహాలలో దాదాపు 100% పనులు పూర్తి అయినట్లు మరియు మౌలికసదుపాయాల కల్పన జరిగినట్లు, 5,472 లబ్దిదారులకు పూర్తీ అయిన ఇండ్లు ఇవ్వగా 3,122 మంది గృహాలలో నివాసం ఉంటునట్లు అధికారులు చెబితున్నారు, మిగిలిన 2,350 మంది లబ్ధిదారులు ఏందుకు నివాసం ఉండడం లేదో విచారణ చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మిగిలిన 304 గృహాల పరిస్థితి ఏమిటని అధికారులను అడగడం జరిగింది, వాటిని లబ్దిదారులకు ఎప్పుడు అందిస్తారని వివరణ కోరడం జరిగింది.
అమృత్ 1.0 & 2.0 :
జిల్లాలో పట్టణాలలో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగు నీటి సరఫరా కోసం, ఎస్టీపీ కోసం, వాటర్ పంపింగ్ కోసం మరియు సీవరేజ్ లైన్ కోసం అమృత్ 1.0 క్రింద 2016 - 17 లో ఫేస్ 1 లో కాకినాడ పట్టణం కు కేటాయించిన 20,415 నీటి కుళాయిల కోసం 41.45 కోట్ల రూపాయిలతో 113.68 కిమీ పైప్ లైన్ పనులను 37.35 కోట్లకు పూర్తీ చేసినట్లు మరియు 75 లక్షల అంచనా వ్యయంలో 57 లక్షలకు రాజారామ్ మోహన్ రాయి పార్క్ అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే అమృత్ 1.0 ఫేస్ 2 క్రింద 98.41 కోట్ల విలువైన 57.33 కిమీ స్ట్రాం వాటర్ డ్రైనేజీ పనులు మొత్తం పూర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు 5 ఎంఎల్డీ ఎస్టీపీ కోసం 29.17 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకు కేవలం 9.07 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు, మిగిలిన 20.10 కోట్ల విలువైన పనులకు టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. వీటితో పాటు సమ్మెత , వెంకటేశ్వర మరియు దుమ్ములపేట పార్కుల అభివృద్ధి కోసం 2.65 కోట్లు కేటాయిస్తే, 1.62 కోట్లు ఇప్పటివరకు ఖర్చు చేశారని, మిగతా పనులు త్వరలో పూర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.
ఇప్పుడు అమృత్ 2.0 లో 339.35 కోట్లు ప్రతిపాదనలతో కాకినాడ పట్టణానికి నీటి సౌకర్యం కోసం మరియు వెనుకబడిన ప్రాంతాలలో సివరేజ్ నెట్వర్క్ కోసం డీపీఆర్ తయారు చేశామని చెబుతున్నారు.
అమృత్ 2.0 లో నీటి సౌకర్యం కల్పన మరియు నిర్వహణ కోసం సామర్లకోటకు 23.26 కోట్లు, పెద్దాపురంకు 36.21 కోట్లు, పిఠాపురంకు 22.64 కోట్లు, గొల్లప్రోలుకు 7.07 కోట్లు, ఏలేశ్వరంకు 73 లక్షలు మరియు తునికి 13.44 కోట్లు డీపీఆర్ తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.
కార్పొరేషన్ మరియు మున్సిపాల్టీల నిధులు 2019 - 25 మధ్య సీ ఎఫ్ ఏం ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకోవడం వల్ల పనులు సక్రమంగా జరుగలేదు. గడచిన 5 సంవత్సరాల అస్తవ్యస్థ విధానాలు వాలే కాకుండా ఇప్పుడు మంజూరు అయినా అమృత్ 2.0 నిధులు గతంలో పూర్తికాని పనులను పూర్తి అయిన పనులను సమన్వయము చేసుకుంటూ ఈ పనులను పూర్తీ చేయాలని ఆదేశించడం జరిగింది.
పీఎం సూర్య ఘర్ :
పీఎం సూర్య ఘర్ పథకం అమలులో వేగం పెంచాలి, ఈపథకం క్రింద కనిష్ఠంగా 30 వేలు, గరిష్టంగా 78 వేలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. స్వయం సేవ గ్రూపులతో అనుసంధానం అయ్యి నిర్దేశించిన లక్ష్యాలు అందుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ పథకం క్రింద చాల తక్కువగా మొత్తం 5,334 ( ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులను కలుపుకొని ) రిజిస్ట్రేషన్లు పూర్తి అయినా, ఇన్స్టాలేషన్ చాలా నిరాశజనకంగా కేవలం 983 మాత్రమే అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అనంతర వ్యయం భరాయించడానికి సిద్ధం అయినందున ఎస్సీ/ఎస్టీ కేటగిరీ వర్గాల పైన ప్రత్యేక దృష్టి అవసరమని చెప్పడం జరిగింది . బీసీ లకు సబ్సిడీ అనంతరం వ్యయంలో 20 వేలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నందునా విద్యుత్ శాఖ వారు సెర్ప్, మెప్మా, మున్సిపల్ శాఖల వారితో సమన్వయంతో పని చేస్తేనే లక్ష్యాలు పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించడం జరిగింది.
వ్యవసాయ రంగానికి సాయం :
పీఎం కుసుమ్ పథకం ద్వార నాణ్యమైన నిరంతరాయ వ్యవసాయ విద్యుశ్చక్తి సరఫర కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం పురోగతి పైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. గ్రిడ్ కి అనుసంధానం చేయగలిగే 42.18 మెగావాట్ల ప్రాజెక్టులకు అవసరమైన 189.77 ఎకరాల రెవిన్యూ భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో సకాలంలో ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల పీఎం ఫసల్ బీమా యోజన ప్రయోజనం 2022 - 24 మధ్య నష్టపోయిన రైతులకు అందలేదు. 2024 అనంతరం భీమా ప్రీమియం చెల్లింపు సమాచారం రైతులకు సకాలంలో ఇచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు అదికారులు తెలిపారు.
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2024 - 25 న 1,20,719 మంది రైతులు సంవత్సరానికి 6 వేలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సహాయం పొందుతున్నారు, గడచినా 6 సంవత్సరాలలో 2,207 కోట్ల రూపాయిలు ఈ జిల్లా రైతులకు అందాయి.
ప్రతి యూరియా బ్యాగ్ పైన దాదాపు 2 వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం “ ప్రకృతి సేద్యాన్ని “ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, రైతులకు ప్రకృతి సేద్యం పైన ఉన్న తొలగించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది.
పీఎం విశ్వకర్మ :
పీఎం విశ్వకర్మ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం సహాయంతో 18 రకాల చేతి వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ, 15 వేల రూపాయల విలువైన టూల్ కిట్ మరియు సబ్సిడీ వడ్డీ పైన బ్యాంకు రుణం కోసం జిల్లాలో 5,495 దరఖాస్తులు రాగా, 3 .821 మందికి శిక్షణ పూర్తి అయినా ఏంత మందికి బ్యాంకుల నుండి రుణాలు ఆమోదం వచ్చాయి అనే లెక్కలు అధికారుల నుండి అందలేదు.
పీఎం స్వనిధి:
పీఎం స్వనిధి క్రింద వీధి వ్యాపారులు కేంద్ర ప్రభుత్వం సహాయంతో జిల్లాలో 23,341 మంది మొదటి దఫా లబ్ధిదారులకు 10 వేల రూపాయల రుణం, 8,088 మంది రెండవ దఫా లబ్ధిదారులకు 20 వేల రూపాయల రుణం మరియు 1,913 మంది మూడవ దఫా లబ్ధిదారులకు 50 వేల రూపాయల రుణం వడ్డీ సబ్సిడీ మీద అందించడం జరిగింది.
జాతీయ ఆహార భద్రత చట్టం:
జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద కేంద్రప్రభుత్వం 1,57,517 కార్డులకు 4.45 లక్షల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన క్రింద కేంద్రప్రభుత్వం ప్రతి ఒక్కరికి 5 కేజీల ఉచిత బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని అంత్యోదయ కార్డులున్నావారికి నెలకు 35 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా, నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం 4,86,357 కార్డులకు 13.86 లక్షల మందికి ఉచితంగా బియ్యం ఇవ్వడం జరుగుతుంది.
రాష్ట్రీయ గోకుల్ మిషన్:
రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మేలురకం పశువుల సంతాన ఉత్పత్తి పెంచడం, ఆవులు , గేదెలను సబ్సిడీ పైన రుణాలు అందించడం ద్వారా పాల ఉత్పత్తి పెంచి గ్రామాలలో నివసించే వారికి అదనపు ఆదాయం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది.
పర్యాటకంగా అభివృద్ది:
జిల్లాలో పర్యాటకంగా అభివృద్ది కోసం కేంద్ర ప్రాయోజిత ప్రసాద్ పథకం క్రింద అన్నవరం దేవస్థానం కోసం 25.32 కోట్లు ఆమోదం వచ్చి అభివృద్ధి పనుల కోసం టెండర్ పక్రియ కొనసాగుతుంది.
2013 లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కోసం టూరిజం మంత్రిత్వ శాఖ 12 కోట్లు కేటాయించింది, కానీ ఇప్పటివరకు 6 కోట్లు విడుదల చేశారు. 12 సంవత్సరాలలో 50% నిధులు మాత్రమే విడుదల అయ్యాయి అంటే మిగతా పనులు పూర్తి కావాలంటే సవరించిన అంచనాలతో ముందుకు వెళ్ళాలి.
హోప్ ఐ ల్యాండ్, దేవాలయాలతో అనుసంధానం చేస్తూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయడం కోసం డీపీఆర్ తయారు చేయాలి అని సూచించడం జరిగింది.
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ తో ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధి కోసం కార్యాచరణ వేగవంతం చేయాలని సూచించడం జరిగింది.
పారిశ్రామిక రంగంలో అభివృద్ధి:
జిల్లాలో 5,442.02 ఎకరాల భూమి పారిశ్రామిక అవసరాల కోసం సిద్ధంగా ఉందని, అందులో 3,250.50 ఎకరాల భూమిలో 19 పారిశ్రామికవాడలు అభివృద్ధి చేశారని, మరో 3 పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు సమచారం ఇచ్చారు.
స్మార్ట్ సిటీ నిధులు - స్లమ్ ఏరియా అభివృద్ధి:
స్మార్ట్ సిటీ నిధుల వినియోగం పైన సమీక్ష జరిగింది. మొత్తం 1005 కోట్ల రూపాయల నిధులు 76 పనులకు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 259.40 కోట్ల విలువైన 38 పనులు పూర్తి చేసినట్లు, మరో 669.91 కోట్ల విలువైన 33 పనులు జరుపుతున్నట్లు కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు వెబ్సైట్ లో ఉంది.
కాకినాడలో 24 జూలై 2023 నాటికి మొత్తం 1,910.24 కోట్ల రూపాయలతో 94 పనులలో 1,123.13 కోట్ల రూపాయలతో 72 పనులు పూర్తి అయినట్లు, మరో 787.11 కోట్ల రూపాయలతో 22 పనులు జరుగుతున్నట్లు రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది.
ఇంత భారీ ఎత్తున సమాచార అంతరం ఎలా ఉంది అని అధికారులను అడగడం జరిగింది, దీనిపైన నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగింది.
కాకినాడలో 19.77 కోట్లు బడ్జెట్ తో స్లమ్ ఏరియా అభివృద్ధి కోసం బడ్జెట్ పెట్టారు.
ముఖ్యంగా కాకినాడ జిల్లా అభివృద్ధి ప్రణాళికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వ్యవసాయ మరియు సీ పోర్ట్ ఆధారిత మెరైన్ మరియు ఆహార, వస్తు తయారీ పరిశ్రమలు రియు పర్యాటక, సేవ రంగంలో ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు పెంచి జిల్లాను స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోని వికసిత భారత్ కు బాటలు వేయాల