logo

నంద్యాల......... అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించిన నంద్యాల టిడిపి జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్

నంద్యాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పట్టణంలోని బొమ్మల సత్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి టిడిపి జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ,బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కరనీ కొనియాడారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారన్నారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు నాగేష్, సందీప్,ఠాగూర్,శంకర్ ,షబ్బీర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

15
1362 views