
సర్జన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..
మెదక్ మీడియా టుడే స్టాఫ్ రిపోర్టర్ 🇮🇳బైండ్ల లక్ష్మణ్ 🇮🇳
సర్జన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.
ఆదివారం హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలోని సర్జన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత వైద్యాధి కారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ ఆరా తీశారు.ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపడాలని , రోగుల సంఖ్య పెరగాలని అన్నారు.
పేషెంట్లతో మాట్లాడి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు...? అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రసవాల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మందులు అన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, లేబర్ రూమ్ లో సదుపాయాలు కల్పించాలని అన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పేషెంట్లకు మెరుగైన, నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలని కలెక్టర్ సూచించారు.
తనిఖీలో కలెక్టర్ వెంట , ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.